కమల్ హాసన్‌పై కేసు నమోదు
- May 15, 2019
స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది గాడ్సే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్‌పై కేసు నమోదైంది. హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కమల్‌పై అరవక్కురిచ్చి పోలీస్ స్టేషన్లో కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో కమల్ హాసన్‌పై 153-ఏ, 295-ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
అరువక్కురిచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్…స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరామ్ గాడ్సే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మగాంధీని హత్యచేసిన గాడ్సేతోనే దేశంలో ఉగ్రవాదం ఆరంభమైందని వివాదాస్పద కామెంట్స్ చేశారు కమల్. ఇక్కడ ముస్లీం ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని తాను చెప్పడం లేదని..ఎక్కడైనా ఇదే మాట చెబుతానని అన్నారు. కమల్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందువుల మనోభావాలు దెబ్బతిసిన కమల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- గోల్డ్ రూల్స్..క్లారిటీ కోరిన యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ..!!
- ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని తప్పుబట్టిన UNSC..!!
- ముబారకియా మార్కెట్లో 20 దుకాణాలు మూసివేత..!!
- ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండించిన GCC, రష్యా..!!
- అరేబియా చిరుతపులి రక్షణకు మొబైల్ క్లినిక్..!!
- రీజినల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
- YSR వారసుడిగా నా కొడుకే ..వైఎస్ షర్మిల
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్