18న శనివారం జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ ప్రారంభం
- May 17, 2019
అమీర్‌పేట టూ హైటెక్ సిటీ మెట్రో మార్గం మొత్తం క్లియర్ అయ్యింది. పెండింగ్ లో ఉన్న, కీలకమైన జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ ను ప్రారంభించటానికి ముహూర్తం ఖరారు చేశారు. 2019, మే 18వ తేదీ శనివారం ఉదయం నుంచి సర్వీసులు ప్రారంభించనున్నారు. ఈ మార్గంలో మెట్రో సర్వీసులు మార్చి 20న ప్రారంభం అయ్యాయి.
మాదాపూర్, పెద్దమ్మతల్లి, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మెట్రోస్టేషన్లలో సర్వీసులకు బ్రేక్ పడింది. విడతల వారీగా మొదట మాదాపూర్, ఆ తర్వాత పెద్దమ్మతల్లి స్టేషన్లను ప్రారంభించారు. మిగిలిన ఒకే ఒక్క జూబ్లీహిల్స్ స్టేషన్ ను మాత్రం మే 18, శనివారం నుంచి ఓపెన్ చేస్తున్నారు. ఈ స్టేషన్ ప్రారంభంతో నాగోల్ నుంచి హైటెక్ సిటీ మధ్యలో అన్ని స్టేషన్లు అందుబాటులోకి వచ్చినట్లే.
అమీర్ పేట టూ హైటెక్ సిటీ మధ్యలో స్టేషన్లు :
1. మధురానగర్
2. యూసఫ్ గూడ
3. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-5
4. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు
5. పెద్దమ్మతల్లి గుడి
6. మాదాపూర్
7. దుర్గంచెరువు
8. హైటెక్ సిటీ
తాజా వార్తలు
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్