రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు..

- May 23, 2019 , by Maagulf
రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు..

వరుసగా రెండో సారి ప్రధాని పదవిని అలంకరిస్తున్న మోదీ ఈ విజయానికి ఆయన చేసిన ఒంటరి పోరాటమే అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సొంత మెజారిటీతో రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టనున్న నేతగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. కీలకమైన రాష్ట్రాల్లో భాజాపా పట్టు సాధించింది. హిందీ ప్రధాన భాషగా ఉన్న రాష్ట్రాలు మోదీకి వెన్నుదన్నుగా నిలిచాయి. బీహార్, చత్తీస్‌ఘడ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఝుర్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరాఖండ్, దిల్లీలో భాజపా తన విశ్వరూపాన్ని చూపించింది. బలమైన ఓటు బ్యాంకులు ఉన్న ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీలు కలిసినా భాజాపాను అడ్డుకోలేకపోయాయి.

చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. అయినా జాతీయ స్థాయి ఎన్నికలు వచ్చేసరికి వారికి మోదీనే బలమైన వ్యక్తిగా కనిపించారు. జమ్ముకశ్మీర్‌లో కూడా తన పట్టును నిరూపించుకుంది. సొంతరాష్ట్రమైన గుజరాత్‌లో మోదీ ఏమాత్రం పట్టు కోల్పోలేదనడానికి ఈ ఫలితాలే రుజువు. ఇక దేశ ప్రజలు మోదీని బలమైన నేతగా చూస్తున్నారన్న విషయాన్ని ఈ ఎన్నికలు నిరూపించాయి. గతంలో రెండోసారి ప్రధాని పదవి చేపట్టిన ఇందిరాగాంధీ ప్రభుత్వంలో బలమైన నేతగా ఎదిగారు. మోదీ స్వతంత్రంగా తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలే ఆయన్ను తిరుగులేని నేతగా చేశాయి. ధైర్యవంతుడైన పాలకుడిగా మోదీ ప్రజల మనసుల్లో ముద్ర వేసుకున్నారు. అందుకే ఆయన్ను విజయం మరోసారి వరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com