రాహుల్ రాజీనామాను తిరస్కరించిన CWC

- May 25, 2019 , by Maagulf
రాహుల్ రాజీనామాను తిరస్కరించిన CWC

ఢిల్లీ:ఊహించిందే జరిగింది. రాహుల్ రాజీనామాను CWC తిరస్కరించింది. హాట్ హాట్ గా ప్రారంభమైన ఈ భేటీలో మొదట రాహుల్ రాజీనామాపైనే చర్చ జరిగింది…చెప్పినట్లుగానే ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని ప్రతిపాదించారు రాహుల్.. అయితే ఇందుకు సీడబ్ల్యూసీ అంగీకరించలేదు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని..విజయం కోసం చాలా కృషి చేశామని ..వ్యతిరేక ఫలితాలు వచ్చినంత మాత్రాన రాజీనామా చేయాల్సిన పని లేదని పలువురు నేతలు సమావేశంలో అభిప్రాయపడ్డారు….కావాలనే కొందరు రాహుల్ ను టార్గెట్ చేస్తున్నారని… ఈ కష్టకాలంలో పార్టీ రాహుల్ కు అండగా నిలబడాలన్నారు….లోక్‌సభ ఎన్నికల్లో ఊహించని ఘోర పరాజయం తర్వాత రాహుల్ పై ఒత్తిడి పెరిగిపోయింది. అటు రాహుల్ కూడా గతంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతే అధ్యక పదవి నుంచి తప్పుకుంటానని చెప్పారు. చెప్పినట్లుగానే రాహుల్ రాజీనామాకు సిద్ధపడ్డారు కానీ సీడబ్ల్యూసీ ఇందుకు అంగీకరించలేదు..గతంలో సోనియా గాంధీ కూడా రాజీనామాకు సిద్ధపడ్డారు… అప్పుడు కూడా ఆ నిర్ణయాన్ని CWC తిరస్కరించింది…

ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్‌ నేతలు గలాం నబీ ఆజాద్‌, మల్లికార్జున్‌ ఖర్గే, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరం పరాభవంపైనా సమావేశంలో చర్చ జరుగుతోంది..కాంగ్రెస్ దాదాపు 17 రాష్ట్రాల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో అయితే కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. ముఖ్యంగా పార్టీకి కంచుకోటగా ఉన్న అమేథీ నుంచి రాహుల్ ఓడిపోవడాన్ని పార్టీ జీర్ణించుకోలేక పోతోంది.. పైగా ప్రియాంకా గాంధీని రంగంలోకి దించినా పెద్దగా ఉపయోగపడలేదు… ఆమె ముఖ్యంగా యూపీపైనే ఎక్కువ ఫోకస్ చేశారు..అమేథీ, రాయబరేలీలోనూ ప్రచారం నిర్వహించారు.. అయినా మోడీ వేవ్ ముందు ఇవేమీ పనిచేయలేదు….

దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ గత కొన్నేళ్లుగా తన ప్రభను కోల్పోతూ వస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2 చోట్ల గెలుపొందిన పార్టీ.. ఈ సారి ఎన్నికల్లో ఒక స్థానానికే పరిమితమైంది. అటు ఒడిశాలోనూ కాంగ్రెస్‌ పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. మొత్తం 21 లోక్‌సభ స్థానాలుండగా.. కేవలం ఒకే ఒక్క చోట కాంగ్రెస్‌ గెలుపొందింది. ఇక 147 అసెంబ్లీ స్థానాల్లో 9 చోట్ల మాత్రమే విజయం సాధించగలిగింది. అటు ఇప్పటికే యూపీ కాంగ్రెస్‌ చీఫ్‌ రాజ్‌ బబ్బర్‌, ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌ తమ రాజీనామాలు రాహుల్ కు పంపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com