పెస్టిసైడ్ వాసన పీల్చిన 10 ఏళ్ళ చిన్నారి మృతి
- May 27, 201910 ఏళ్ళ పాకిస్తానీ చిన్నారి పెస్టిసైడ్ని ఇన్హాలేషన్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. షార్జాలోని అల్ నహ్దా ఏరియాలోని ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కోమల్ ఎస్ ఖాన్ అనే చిన్నారి పెస్టిసైడ్ వాసన పీల్చి అస్వస్థతకు గురికాగా, హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆ చిన్నారి మృతి చెందడం జరిగింది. చిన్నారి తల్లి ఆరిఫా షాఫి ఖాన్, తండ్రి షఫీయా అల్లాహ్ ఖాన్ కూడా ఈ ఘటనలో తీవ్రంగా అస్వస్థతకు గురైన ఆసుపత్రిలో చేరారు. అయితే ఆ తర్వాత వారు డిశ్చార్జ్ అయ్యారు. టాక్సిక్ కెమికల్స్ ప్రభావానికి వారు గురైనట్లు ఫ్యామిలీ మెడికల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అల్యూమినియమ్ ఫాస్ఫైడ్ అనే కెమికల్ ఈ దారుణానికి కారణమైందని ఫోరెన్సిక్ ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో తేలింది. ప్రొఫెషనల్ పెస్ట్ కంట్రోల్ కంపెనీల సాయం లేకుండా అపార్ట్మెంట్ టెనెంట్స్ ఈ కెమికల్ని వాడి వుంటారని అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..