కువైట్‌లో రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి

- May 28, 2019 , by Maagulf
కువైట్‌లో రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి

కువైట్‌ సిటీ: కబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 8 మంది ప్రాణాల్ని బలిగొంది. సెక్యూరిటీ ఫోర్సెస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఓ చిన్న రోడ్డు ప్రమాదం జరగ్గా, అది చూసేందుకు పెద్దయెత్తున జనం గుమికూడారు. మరోపక్క అతి వేగంగా దూసుకొచ్చిన ఇంకో వాహనం, అక్కడి వారిపైనుంచి దూసుకెళ్ళడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతి చెందినవారిలో ఐదుగురు కువైటీలు కాగా, ఓ సౌదీ మరో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com