గల్ఫ్ దేశాల్లో తెలుగుదేశం కార్యకర్తలకు వెంకట అప్పారావు(TDP కో-ఆర్డినేటర్) లేఖ
- May 29, 2019గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు నమస్కారం.పార్టీ ఓడిపోయింది అని ఎవ్వరూ భావించవద్దు.ఈవీఎంలు గెలిచాయి ప్రజలు ఓడిపోయారు.ఇది యధార్థం.ప్రస్తుతం మనం కొంచెం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మాట వాస్తవం.ఇలాంటి సమయంలో అందరం ఒకరికి ఒకరు అండగా భుజం తట్టి ప్రోత్సహించి చేతిలో చెయ్యి కలుపుకుని ముందుకు నడవాలి.అలా నడిపించవలసిన బాధ్యత నాయకులకు ఉంది.
గల్ఫ్ దేశాల్లో మన తెలుగు వారు పార్టీ పరంగా లేక వ్యక్తిగతంగా ఎక్కడ ఎవరు ఎలాంటి మీటింగ్స్ గానీ ఫంక్షన్స్ గానీ జరిపినప్పుడు మనల్ని వారు తరతమ భేదం లేకుండా సహృదయంతో ఆహ్వానించినప్పుడు ఎలాంటి భేషజాలకు పోకుండా అనవసరమైన విమర్శలకు తావీయకుండా అటెండ్ కాగలరని నా అభిలాష.(కార్యక్రమ నిర్వాహకులు కూడా వీళ్లు మనవాళ్ళు వాళ్లు మనవాళ్లు కాదు అనే భేదం లేకుండా అందరూ మనవారే అనే సద్భావంతో మంచి మనస్సుతో ఆహ్వానించ వలసనదిగా మనవి) అందరూ కలసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మేమందరం ఒక్కటే అనే భావాన్ని వ్యక్తీకరించగలరని అభ్యర్థన.ఎవరికి వారు మాత్రమే గొప్పవారు కాదు మీరందరూ గొప్పవారే.మీలాంటి గొప్ప మేధావులు భేషజాలకు పోకుండా వారి వారి ఈగోస్ ను పక్కన పెట్టి కలిసి పని చేస్తే ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించగలరు.ఆలోచించండి . ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న తెలుగు వారందరూ మీ వైపు చూసేలా చేసుకోగలరు.
గల్ఫ్ దేశాల్లో కష్టపడి పనిచేస్తూ స్వదేశ అభివృద్ధికి పరితపిస్తూ చేయూతనందిస్తున్న తెలుగు ముద్దు బిడ్డలారా కలిసి ఉంటే కలదు సుఖం.కలిసుంటే నిలబడతాం విడిపోతే పడిపోతాం.
ప్రస్తుతం నా వయస్సు 68 సంవత్సరములు
కాబట్టి
అందరికీ అన్న గా భావించండి. ధన్యవాదములు
మీ శ్రేయోభిలాషి
వెంకట అప్పారావు(టిడిపి గల్ఫ్ కో-ఆర్డినేటర్)
తాజా వార్తలు
- అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్
- టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. పాలకమండలి కొత్త సభ్యులు వీరే..
- ఫుట్‌బాల్ ఆటగాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్‌కు 4 రోజులపాటు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎతిహాద్..!!
- చట్టవిరుద్ధమైన విక్రయాలు.. కార్లను తొలగించాలని నోటీసులు జారీ..!!
- కువైట్‌లోని కార్మికుల్లో అగ్రస్థానంలో భారతీయులు..!!
- మదీనాలో విమానం మెట్లపై నుంచి పడి మహిళా ప్యాసింజర్ మృతి..!!
- ఖతార్ లో మెరైన్ టూరిజం ట్రాన్స్ పోర్ట్ నిబంధనల్లో మార్పులు..!!
- రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
- 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలో దీపావళి..