కారులో అగ్ని ప్రమాదం: ఇద్దరికి గాయాలు

- May 30, 2019 , by Maagulf
కారులో అగ్ని ప్రమాదం: ఇద్దరికి గాయాలు

షార్జా సివిల్‌ డిఫెన్స్‌ ఫైటర్స్‌, కాలిపోతున్న కారులోంచి ఇద్దరు వ్యక్తుల్ని రక్షించారు. బ్రిడ్జి ఆఫ్‌ సెంట్రల్‌ సౌక్‌ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులకు తక్షణ ప్రాథమిక వైద్య సహాయం అందించి, వారిని ఆసుపత్రికి తరలించారు. షార్జా సివిల్‌ డిఫెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హని అల్‌ దహ్మాని మాట్లాడుతూ, అల్‌ దయిద్‌ ప్రాంతంలోని ఓ వేర్‌ హౌస్‌లో జరిగిన ప్రమాదంలో 70 సైకిల్స్‌ కాలిపోయినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. కారు కాలిన ఘటన విషయానికొస్తే, ఫైర్‌ ఫైటర్స్‌ ఐదు నిమిషాల లోపే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించినట్లు అల్‌ దహ్మాని చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com