కార్ల మార్కెట్ తరలింపు తో ఊపిరి పీల్చుకొన్న స్థానికులు

- January 03, 2016 , by Maagulf
కార్ల మార్కెట్ తరలింపు తో ఊపిరి పీల్చుకొన్న స్థానికులు

 అబూ షగర  వాసులకు శుభవార్తతో కొత్త ఏడాది ప్రారంభమైంది. 2016  తొలిరోజునే  ఉపయోగించబడని  370  కార్లను , ఆ ప్రాంతం నుంచి తరలించడంతో అబూ షగర ఇపుడు ఒక సుందరమైన నూతన శోభను సంతరించుకొంది. గత ఏడాది డిసెంబర్ 31 వ తెదే ఈ కార్ల తొలగింపునకు చివరి రోజుగా ప్రభుత్వం ప్రకటించిన విషయం  స్థానికులకు విదితమే, గత 20 ఏళ్ళుగా  అబూ షగర ప్రాంతవాసులకు ఈ గందరగోళ పార్కింగులు ఎంతో చికాకును కల్గిస్తుంది. ఇక్కడ  నెలకొని ఉన్న అసౌకర్యాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. " అమ్మకానికి కారు "  అంటూ రాసి ఉన్న బోర్డులు పలు దుకాణాలు గజిబిజీగా ఉండేవి. అంతేకాకుండా, వివిధ కార్ల ఏజెంట్లు " కారు కొనండి...కారు కొనండి " 

  అని బిగ్గరగా కేకలు పెట్టేవారు. ప్రభుత్వం తీసుకొన్న ఒక మంచి నిర్ణయం కారణంగా, ప్రస్తుతం ఈ ప్రాంతం ఎంతో  ప్రశాంతంగా , సుందరంగా రూపుదిద్దుకొంది. అబూ షగర నివాసితులు  గతంలో తాము పడుతున్న ఇబ్బందుల  గూర్చి  షార్జా ప్రభుత్వానికి ఇచ్చిన పిర్యాఢులకు స్పందన రావడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com