అగ్ని ప్రమాదంలో కారవాన్ల దగ్ధం

- June 10, 2019 , by Maagulf
అగ్ని ప్రమాదంలో కారవాన్ల దగ్ధం

మస్కట్‌: నార్త్‌ అల్‌ ఘుబ్రాలో చోటు చేసుకున్న ఓ అగ్ని ప్రమాదంలో పలు కారవాన్లు దగ్ధమయ్యాయి. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్సెస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, నార్త్‌ అల్‌ గుబ్రా - విలాయత్‌ బౌషర్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశామని అధికారులు తెలిపారు. అయితే ప్రాణ నష్టం, గాయాలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. పెద్దయెత్తున కారవాన్లు ఈ అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com