కొలన్ క్యాన్సర్‌ని ముందే గుర్తించడం ఎలా!
- June 11, 2019బహ్రెయిన్:కొలన్ క్యాన్సర్‌ని ముందే గుర్తించడానికి సంబంధించి ఈ వారంలో సరికొత్త కార్యాచరణను ప్రకటించనున్నారు. కింగ్ హమాద్ యూనివర్సిటీ హాస్పిటల్ - మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అలాగే నేషనల్ కమిటీ ఫర్ కంట్రోల్ క్రానిక్ నాన్ కమ్యూఇనకబుల్ డిసీజెస్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో కొలన్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న దరిమిలా, ఈ ఇనీషియేటివ్‌కి ప్రాధాన్యత ఏర్పడింది. 'టువార్డ్స్ క్యూరబులిటీ' పేరుతో ఈ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభిస్తారు. 45 నుంచి 75 ఏళ్ళ వయసువారిని ఈ క్యాంపెయిన్‌లో టార్గెట్ చేసుకోనున్నారు. ముందస్తుగా కొలన్ క్యాన్సర్‌ని గుర్తించగలిగితే, త్వరగా, తేలికగా నయం చేయవచ్చునని వైద్యులు అంటున్నారు. వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స కష్టమవుతుందనీ, ఆర్థికంగానూ అది మోయలేని భారం అవుతుందనీ కింగ్ హమాద్ యూనివర్సిటీ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెడ్ అలాగే కన్సల్టెంట్ ఫర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసీజెస్ డాక్టర్ ఒమర్ షరీఫ్ చెప్పారు. ఈ క్యాంపెయిన్ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని వివరించారాయన.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ