ఘర్షణల్లో నిర్వాసితులైన 18 వేల కుటుంబాలు
- June 14, 2019
ట్రిపోలీ దక్షిణ ప్రాంతాలలో కొనసాగుతున్న ఘర్షణలు, పోరాటాలలో దాదాపు 18 వేలకు పైగా కుటుంబాలు (94 వేల మంది) నిర్వాసితులయ్యాయని ఐరాసకు చెందిన వలస వ్యవహారాల అంతర్జాతీయ సంస్థ (ఐఒఎం) వెల్లడించింది. నిర్వాసితుల్లో దాదాపు 48 శాతం మంది 18 ఏళ్లలోపు చిన్నారులేనని, వీరిలో దాదాపు 3,900 మందికి పైగా నిర్వాసితులకు ఆశ్రయం కల్పిస్తున్న శరణార్థి శిబిరాలలో నివశిస్తున్నారని ఐఒఎం తన ప్రకటనలో వివరించింది. ఘర్షణల సమీప ప్రాంతాలకు వెళ్లే వారికి ఇప్పటికీ ముప్పు పొంచి వున్నదని ఈ సంస్థ హెచ్చరించింది. మార్షల్ ఖలీఫా హఫ్తార్ నేతృత్వంలోని లిబియన్ నేషనల్ ఆర్మీ గత ఏప్రిల్ 4న నగరంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించటంతో సాయుధ ఘర్షణలు ప్రారంబమయ్యాయి. అప్పటి నుండి ట్రిపోలీ దక్షిణ ప్రాంతంలో తీవ్రస్థాయిలో ఘర్షణలు కొనసాగుతూనే వున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..