వాట్సప్ లో "బల్క్" మెసేజ్ లు పంపితే....
- June 15, 2019
న్యూ ఢిల్లీ:సోషల్ మెసేజింగ్ యాప్ లో వాట్సప్ సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ ను ఇవాళ కొన్నిమిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా టెక్ట్స్ మెసేజ్ లు. వీడియోలు, పీడీఎఫ్ ఫైల్స్ మొదలుకొని లైవ్ చాట్ ల దాకా ఎంతో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నారు. వినియోగదారులకు రోజు రోజుకూ సౌకర్యాలు కల్పిస్తూనే నిబంధనలు కఠిన తరం చేస్తోంది వాట్సప్.
వాట్సప్ ద్వారా చాలామందికి ఒకేసారి బల్క్ మెసెజ్ లు పంపేవారిపై ఇకనుంచి కఠిన చర్యలు తీసుకోనుంది వాట్సప్. నిబంధనలకు విరుధ్ధంగా వాట్సప్ ను దుర్వినియోగం చేస్తే మీపై చట్టపరమైన చర్యలు తీసుకునే చాన్స్ ఉంది. జైలు శిక్ష కూడా పడవచ్చు. సంస్ధలుకానీ వ్యక్తులు కానీ ఒకేసారి ఎక్కవ సంఖ్యలో మెసేజ్ లు పంపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాట్సప్ తెలిపింది. ఈ నిబంధనలు 2019 డిసెంబర్ 7 నుంచి అమల్లోకి వస్తాయంది.
కంపెనీ నియమావళి ఉల్లంఘించినా, అందుకు సహకరించిన వారిపై, ఆటో మోటిక్ గా మెసేజ్ లు ఎక్కవ పంపినా చర్యలు తీసుకుంటామని తెలిపింది. కానీ....ఎటువంటి చర్యలు తీసుకుంటామని స్పష్టత ఇవ్వలేదు. భారతదేశంలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వాట్సప్ ను దుర్వినియోగ పరుస్తూ కొందరు ఫ్రీ క్లోనింగ్ యాప్స్ ద్వారా ఓటర్లకు పెద్ద సంఖ్యలో మెసేజ్ లు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై కేంద్రం వాట్సప్ సంస్ధపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వాట్సప్ ను ఒకేసారి, ఆటోమేటిక్ గా మెసేజ్ లు పంపేందుకు ఏర్పాటు చేయలేదని పేర్కోంటూ వాట్సప్ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..