బీచ్‌లో ప్రాణాలు కోల్పోయిన 26 ఏళ్ళ కేరళ వాసి
- June 17, 2019
ఉమ్ అల్ కువైన్:25 ఏళ్ళ యువకుడు, ఎప్పటిలానే ఈత కొడుతూ సముద్రంలో ప్రాణాలు కోల్పోయారు. ఈద్ అల్ ఫితర్ బ్రేక్ సందర్భంగా స్నేహితులతో కలిసి బీచ్‌కి వెళ్ళిన 25 ఏళ్ళ యువకుడు ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కలచివేసింది. కేరళకు చెందిన ఆనందు జనార్ధనన్, స్విమ్మింగ్ చేస్తూ సేఫ్ లిమిట్స్ దాటి రఫ్ వేవ్స్వైపు వెళ్ళడంతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. జనార్ధనన్ సహచరుడు అలోయ్‌సియుస్ మాట్లాడుతూ, ఓ పెద్ద కెరటం తన స్నేహితుడ్ని సముద్రంలోకి లాక్కెళ్ళిపోయిందని చెప్పారు. స్నేహితుడి కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయిందనీ, చివరికి ఆఫ్‌షోర్ ప్రాంతంలో అతని మృతదేహం దొరికిందని అలోయ్సియస్ చెప్పారు.ఘటనపై అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి పారామెడిక్స్, రెస్క్యూ టీమ్స్ చేరుకుని, జనార్ధనన్ని రక్షించేందుకు ప్రయత్నించినా, ఆసుపత్రికి తరలించాక అతని మృతిని వైద్యులు ఖరారు చేశారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..