ముంబైను ముంచెత్తిన వరదనీరు...
- July 01, 2019
ముంబై : గడచిన నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబై నగరంలో వరదనీరు ముంచెత్తింది. సోమవారం గంట సేపు సమయంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. పరేల్ ప్రాంతంలో 43 మిల్లీమీటర్లు, వర్లిలో 35 మిల్లీమీటర్లు, వడాలలో 32 మిల్లీమీటర్లు, హాజి అలీ ప్రాంతంలో 26 మిల్లీమీటర్లు, బాండ్రాలో 53 మిల్లీమీటర్లు, చెంబూర్ ప్రాంతంలో 37 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షంతోపాటు వీచిన గాలులతో నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి వెదురు కర్రలు కింద పడ్డాయి. దీంతో చర్చ్ గేటు, మెరైన్ లైన్ ల మధ్య ట్రాఫిక్ స్తంభించి పోయింది. పాల్ఘార్ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల పట్టాలపైకి వరదనీరు చేరడంతో ముంబై -వల్సాద్ మార్గంలో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. దాదర్ ఈస్ట్ వద్ద వరదనీరు మోకాలి లోతు చేరింది. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సోమవారం వరదనీటిలోనే పాఠశాలలకు వచ్చారు. సియాన్ -మాటుంగా రైల్వే స్టేషన్ల మధ్య వరదనీరు పట్టాలను ముంచెత్తడంతో ఈ మార్గంలో రైళ్లను నిలిపివేశారు. వరదనీటితో రోడ్లు ఏర్లుగా మారడంతో గాంధీమార్కెట్, ఎస్ వీరోడ్డు, నేషనల్ కాలేజీ రోడ్లను మూసివేసి ట్రాఫిక్ ను దారి మళ్లించారు. ముంబై నగరంలో కురుస్తున్న భారీవర్షాలతో స్థానిక ప్రజలు అవస్థలు పడుతున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!