మల్టీ ఫెయిత్ ప్రేయర్ రూమ్‌ని ప్రారంభించిన అబుదాబీ ఎయిర్ పోర్ట్
- July 01, 2019
అబుదాబీ ఎయిర్ పోర్ట్ వద్ద మల్టీ ఫెయిత్ ప్రేయర్ రూమ్ ప్రారంభమయ్యింది. కొత్త ప్రేయర్ రూమ్, అన్ని రకాల విశ్వాసాలున్న ప్రయాణీకులకు అనుగుణంగా తీర్చిదిద్దారు. మెయిన్ ఎయిర్ పోర్ట్‌కి కాస్త దూరంలో ప్రశాంత వాతావరణంలో ప్రేయర్స్ నిర్వహించుకోవడానికి వీలుగా దీన్ని రూపొందించారు. అబుదాబీ ఎయిర్ పోర్ట్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మ్యూనిటీ డెవలప్‌మెంట్ అలాగే అబుదాబీ ఎయిర్‌పోర్ట్స్ ఛైర్మన్ షేక్ మొహమ్మద్ బిన్ హమాద్ బిన్ టహ్‌నూన్, అబుదాబీ ఎయిర్ పోర్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రయాన్ థాంప్సన్ తదితరులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ హబ్ ఫర్ టోలరెన్స్, మోడరేషన్ అండ్ పీస్‌ఫుల్ కో-ఎగ్జిస్టెన్స్ విభాగంలో యూఏఈ పొజిషన్ ముందు ముందు మరింత మెరుగవుతుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఛైర్మన్ ముఘీర్ ఖామిస్ అల్ ఖయిలి చెప్పారు. బ్రయాన్ థాంప్సన్ మాట్లాడుతూ, గ్లోబల్ హబ్‌గా తాము, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలనుంచి వచ్చే ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో మరో ముందడుగు వేయడం ఆనందంగా వుందని అన్నారు
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..