వరల్డ్‌ స్టాంప్‌ ఎగ్జిబిషన్‌లో బహ్రెయిన్‌కి రెండు మెడల్స్‌

- July 02, 2019 , by Maagulf
వరల్డ్‌ స్టాంప్‌ ఎగ్జిబిషన్‌లో బహ్రెయిన్‌కి రెండు మెడల్స్‌

2019 వరల్డ్‌ స్టాంప్‌ ఎగ్జిబిషన్‌లో బహ్రెయిన్‌ రెండు మెడల్స్‌ గెల్చుకుంది. చైనాలో జరిగిన ఈ పోటీల్లో బహ్రెయిన్‌ టీమ్‌ మెంబర్స్‌ సలెహ్‌ మొహమ్మద్‌ అల్‌ హాసన్‌ మరియు అహ్మద్‌ అబ్దుల్లా అవధి సిల్వర్‌ మెడల్స్‌ని గెల్చుకోగా, ఖాలిద్‌ అల్‌ దార్విష్‌ పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్‌ సొంతం చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 'ఫారిన్‌ స్టాంప్‌ లెక్టర్స్‌' ఈ ఎక్స్‌పోలో తాము సేకరించిన స్టాంపులను ప్రదర్శనకు వుంచారు. చైనా ఈ వరల్డ్‌ స్టాంప్‌ ఎగ్జిబిషన్‌ని హోస్ట్‌ చేయడం ఇది మూడో సారి. స్టాంపుల్ని సేకరించడం అనే హాబీ పట్ల అవగాహన, ఆసక్తి పెంచేందుకోసం నిర్వాహకులు చేస్తోన్న ఈ ప్రయత్నం మంచి విజయాల్ని సాధిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు స్టాంప్‌ కలెక్షన్‌ని ఓ హాబీగా మలచుకుంటుండడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com