స్కామ్ మెసేజ్లపై బ్యాంక్ మస్కట్ హెచ్చరిక
- July 10, 2019
మస్కట్: ఫ్రాడ్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా వుండాలంటూ బ్యాంకు వినియోగదారులకు బ్యాంక్ మస్కట్ సూచించింది. ఏటీఎం కార్డులు బ్లాక్ అయ్యాయని పేర్కొంటూ, ఓ నెంబర్ని కాంటాక్ట్ చెయ్యాలని సూచిస్తూ వాట్సాప్ ద్వారా వినియోగదారులకు మెసేజ్లు వస్తున్నాయి. కొన్నిసార్లు డైరెక్ట్ మెసేజ్లు కూడా అక్రమార్కుల నుంచి వస్తున్నాయి వినియోగదారులకు. నిజమేనేమోనన్న ఆందోళనతో సదరు నెంబర్కి కాల్ చేస్తే, ఆ తర్వాత బ్యాంకు అక్కౌంట్లు ఖాళీ అయిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి మెసేజ్లకు స్పందించరాదనీ, అనుమానాస్పద మెసేజ్ల విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాలని బ్యాంక్ మస్కట్ సూచించింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!