అబుదాబీకి చెందిన ఇండియన్ టెకీ హత్య
- July 11, 2019
అబుదాబీకి చెందిన ఇండియన్ టెకీ, హైద్రాబాద్‌లో హత్యకు గురయ్యాడు. హోటల్ రూమ్‌లో టెకీ శ్రీకాంత్‌రెడ్డిని హత్య చేశాడు అతని సహచరుడు నరేష్. శ్రీకాంత్‌రెడ్డికి నరేష్ బాయ్‌ఫ్రెండ్ అని పోలీసులు చెబుతున్నారు. గుంటూరుకి చెందిన శ్రీకాంత్‌రెడ్డికి ఇటీవల పెళ్ళి కుదరడంతో ఆ విషయమై శ్రీకాంత్ రెడ్డి, నరేష్‌ల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగి, చివరికి హత్యకు దారి తీసినట్లు వెల్లడించారు పోలీసులు. హత్యకు ముందస్తు ప్రణాళికతోనే హోటల్‌కి నరేష్ వచ్చాడనీ, ఈ క్రమంలో తన వెంట కత్తిని తెచ్చుకున్నాడనీ విచారణలో నిందితుడి నుంచి సమాచారాన్ని రాబట్టారు హైద్రాబాద్ పోలీసులు. హత్య తర్వాత నిందితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే, స్వల్ప గాయం కావడంతో నిందితుడికి వైద్య చికిత్స అందించిన పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..