స్విమ్మింగ్ పూల్‌లో మునిగి రెండేళ్ళ చిన్నారి మృతి
- July 11, 2019ఫ్యామిలీ స్విమ్మింగ్ పూల్‌లో మునిగికి రెండేళ్ళ చిన్నారి మృతి చెందిన ఘటన అబుదాబీలో చోటు చేసుకుంది. అల్ అయిన్‌లోని ఓ హౌస్ పూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుందని అబుదాబీ పోలీసులు వెల్లడించారు. అల్ అయిన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు. జూన్‌లో కూడా ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. రస్ అల్ ఖైమాలోని ఓ స్విమ్మింగ్ పూల్‌లో ఇద్దరు చిన్నారులు (కవలలు) నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటివి జరుగుతాయని చెప్పారు బ్రిగేడియర్ హుమైది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?