పాస్‌పోర్టు 11 రోజుల్లోనే జారీ:మురళీధరన్
- July 12, 2019
న్యూ ఢిల్లీ :కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. పాస్ పోర్టు కోసం ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పంది.సాధారణ పరిస్థితుల్లో 11 రోజుల్లోనే పాస్‌పోర్టు జారీ చేస్తామని లోక్‌సభలో కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ తెలిపారు. పాస్‌పోర్టు పొందేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ మనీశ్ తివారీ ప్రస్తావించారు.
పాస్ పోర్టు పొందే విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని... విచారణ పేరుతో ఆలస్యం జరుగుతోందని ఒక్కోసారి పాస్ పోర్టు రద్దయే పరిస్థితి కనిపిస్తోందని ఎంపీ తివారీ చెప్పారు. దీనిపై మంత్రి సమాధానమిచ్చారు.పాస్‌పోర్టు జారీ ప్రక్రియలో పోలీస్ వెరిఫికేషన్ కోసం 731 పోలీస్ జిల్లాల్లో యాప్‌ను ఉపయోగిస్తున్నామని మంత్రి చెప్పారు.
యాప్ ద్వారా అవినీతి రహితంగా విచారణ జరగమే కాకుండా, త్వరగా పాస్ పోర్టు పొందేందుకు అవకాశం కలుగుతోందన్నారు. దేశంలో 36 పాసుపోర్టు కేంద్రాలు ఉన్నాయని, 93 పాసుపోర్టు సేవా కేంద్రాలు ఉన్నాయని వివరించారు.412 పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఉన్నాయని, వీటిని నడిపేందుకు ఓ ప్రైవేట్ సంస్థ సహకారం తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..