కింగ్ హమాద్, ఎవెన్యూ 15, బుడైయా హైవేస్‌పై లేన్ క్లోజర్స్
- July 12, 2019
బహ్రెయిన్: కింగ్ హమాద్ హైవేపై సౌత్ బౌండ్ స్లో లేన్‌పై ట్రాఫిక్ని మూసివేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ మరియు అర్బన్ ప్లానింగ్ వెల్లడించింది. ఈ క్లోజర్ గురువారం 11 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుంది. మరోపక్క, బుడైయా హైవేపై దురాజ్ ప్రాంతంలో ఒక లేన్ని మూసివేసి, ఒక లేన్ని రెండు వైపులా ట్రాఫిక్‌కి అనుమతిస్తారు. సీవరేజ్ కనెక్షన్స్ వర్క్స్ కోసం ఈ మూసివేత అమలు చేస్తారు. రెండు నెలలపాటు ఈ మూసివేత అమల్లో వుంటుంది. పార్క్ ఆఫ్ అవెన్యూ 15 - అలమామీర్ వద్ద రోడ్ 3401 నుంచి షేక్ జబర్ అల్ అహ్మద్ అల్ సుబాహ్ హైవే మధ్య మూసివేస్తారు. డైవర్షన్‌గా 3417 వుంటుంది. అల్బా మరియు నువైదిరాత్ ఇంటర్‌ఛేంజ్ అభివృద్ధి కోసం ఈ నిర్ణయం అమలు చేస్తున్నారు. 3 వారాల పాటు ఈ మూసివేత అమల్లో వుంటుందని మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ మరియు అర్బన్ ప్లానింగ్ పేర్కొంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!