అతి త్వరలో త్రీడీ ప్రింటెడ్ హౌస్
- July 18, 2019దుబాయ్‌లో అతి త్వరలో త్రీడీ ప్రింటెడ్ హౌస్ అందరినీ ఆశ్చర్యపరచబోతోంది. దుబాయ్‌కి చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ ఎమార్, త్రీడీ మోడల్ హోమ్‌ని అరేబియన్ రాంచెస్ 3లో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రాపర్టీ రంగంలో త్రీడీ ప్రింటెడ్ హౌస్ అనే సాంకేతికతను అభివృద్ధి చేసే దిశగా స్థానిక కాంట్రాక్టర్ ద్వారా ఈ నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. ఈ త్రీడీ ప్రింటెడ్ మోడల్ హౌస్, నిర్మాణ రంగంలో ఓ అద్భుతం కాబోతోందనీ, ఇది మరింతమందికి కొత్త మార్గం చూపుతుందని అంచనా వేస్తున్నారు. దుబాయ్‌లో ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీస్ పయనీర్‌గా వున్న తాము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఎప్పుడూ ముందుంటామనడానికి ఇదే నిదర్శనమని ఎమార్ ప్రాపర్టీస్ ఛైర్మన్ మొహమ్మద్ అలాబ్బర్ చెప్పారు. నిర్మాణ రంగంలో ఖర్చుని తగ్గించడం, వినియోగదారుల ఆలోచనలకు తగ్గట్టుగా నిర్మాణాలు చేపట్టడం త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో మరింత సులభతరం కానున్నాయి.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్