ఖతర్ లో 'KTR' పుట్టిన రోజు వేడుకలు

- July 24, 2019 , by Maagulf
ఖతర్ లో 'KTR' పుట్టిన రోజు వేడుకలు

ఖతర్:తెలంగాణ యువ సారధి,TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడంట్,సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా TRS ఖతర్ ఆధ్వర్యంలో దోహా లో జన్మదిన వేడుకలు జరిగాయి.

KTR ఇచ్చిన 'గిఫ్ట్ ఏ స్మైల్ ' పిలుపు మేరకు జన్మదిన వేడుకల్ని నిరాడంబరంగా జరిపి అందుకు బదులుగా TRS ఖతర్ ఆధ్వర్యంలో తెలంగాణ లోని జగిత్యాల లో జగ్గసాగర్,పోసాని పెట్ గ్రామాల్లో,మెట్పల్లి,రాఘవ పెట్ పాఠ శాలల్లో చిన్నారులకు నొట్ బుక్కులు,పెన్సిల్స్, స్వీట్స్ మరియు ఇతర సామాగ్రి అంద చేశారు.

TRS ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని కేక్ కట్ చేసి KTR కి శుబాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నర్సయ్య డొనికెని,ఇండస్ట్రియల్ ఏరియా ఇంచార్జి శంకర్ సుందరగిరి,యువజన విభాగం అధ్యక్షుడు మహేందర్ చింతకుంట,రామన్న యువసేన అధ్యక్షుడు అండుగుల్ల రాకేశ్ యాదవ్,TRS సీనియర్ నాయకులు మల్లేష్ సుధవేని,గోపి మంతెన,మధు మ్యాక,శంకరచారి బొప్పరపు,రాజి రెడ్డి మాసం,తేజా కుంభొజి,ప్రమోద్ కేతే, నర్సింలు,రాజేశం గౌడ్,రాజేశ్వర్,మల్లయ్య,మోహన్ దాస్ దుసా,రాజేష్,విష్ణు వర్ధన్ రెడ్డి,శరత్ బాబు మరియు తెలంగాణ జాగృతి నాయకులు శశాంక్ అల్లకొండ,యెల్లయ్య తాళ్లపెళ్లి,శేఖర్ అల్లకొండ,శేఖర్ చిలువెరి పాల్గొన్నారు.

అనంతరం TRS NRI ముఖ్య సలహాదారు కల్వకుంట్ల కవిత కి,TRS NRI కో ఆర్డినేటర్ మహేష్ బిగాలా ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి కేసిఆర్,TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ తీసుకువస్తున్న జనరంజకమైన పెన్షన్, రైతు భీమా,రైతు బంధు పథకాలు తెలంగాణ ప్రజలకు వరాలుగా మారాయన్నారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com