ఫీజ్‌ పెంచడంలేదన్న డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌

- January 06, 2016 , by Maagulf
ఫీజ్‌ పెంచడంలేదన్న డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌

ఇంధన ధరల్లో పెరుగుదల కారణంగా డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్లు ఫీజు పెంచుతున్నారనే వార్తలు రాగా, ఆ వార్తల్లో నిజం లేదని డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్లు వెల్లడించారు. పెరుగుదల చాలా తక్కువగా ఉండటంతోనే ఫీజు పెంచడంలేదని ఓ డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ చెప్పారు. అయితే భవిష్యత్తులో ఇంధన ధరలు ఇంకా పెరిగితే, అప్పుడు ఫీజు పెంచక తప్పదని ఆయన అన్నారు. ఇన్‌స్ట్రక్టర్స్‌ అందరం కలసి కట్టుగా ఫీజు పెంపకపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారాయన. గంట సమయానికి లెర్నర్స్‌ 6 నుంచి 8 ఒమన్‌ రియాల్స్‌ వరకూ చెల్లిస్తారనీ, ఛార్జీలు పెంచవలసి వస్తే దాన్ని 10 ఒమన్‌ రియాల్స్‌ చేయవలసి ఉంటుందన్న ఆయన, అలా పెంచడం ద్వారా ట్రైనీలపై భారం పెరుగుతుందనీ, తద్వారా లైసెన్స్‌ పొందడం భారమవుతుందని చెబుతూ పలు కారణాలతో ప్రస్తుతానికి ఫీజు పెంపకం ఆలోచనలకే పరిమితమయ్యిందని వివరించారు. ఇంధన ధరల పెంపుతో అన్ని విభాగాల్లోనూ ఛార్జీల మోత మోగనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com