ఎతిహాద్‌ రైల్‌: కార్గో ట్రాన్స్‌పోర్ట్‌ జోరు

- January 06, 2016 , by Maagulf
ఎతిహాద్‌ రైల్‌: కార్గో ట్రాన్స్‌పోర్ట్‌ జోరు



యూఏఈ నేషనల్‌ రైల్వే డెవలపర్‌ అయిన ఎతిహాద్‌ రైల్‌ సెవా లాజిస్టిక్స్‌తో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మల్టీ మోడల్‌ కనెక్టివిటీని సెవా లాజిస్టిక్స్‌ ఉపయోగించుకోవడానికి వీలు కలిగింది. 2009లో ఎతిహాద్‌ రైల్‌ స్థాపించబడింది. యూఏఈ నేషనల్‌ ఫ్రైట్‌ మరియు ప్యాసింజర్‌ రైల్వే నెట్‌వర్క్‌ నిర్మాణం, మరియు నిర్వహణ బాధ్యతల్ని ఎతిహాద్‌ రైల్‌ స్వీకరించింది. మూడు స్టేజీల్లో రైల్వే నెట్‌వర్క్‌ నిర్మితం కావాల్సి ఉంది. జీసీసీ రైల్‌ నెట్‌వర్క్‌లో ఇది కీలక భూమిక పోషించనుంది. ఇందులో తొలి స్టేజ్‌ వినియోగంలోకి వచ్చింది. అయితే తొలి స్టేజ్‌ పూర్తిగా సరుకు రవాణా కోసమే ఉపయోగపడ్తోంది. గ్యాస్‌ ఫీల్డ్స్‌ షా అండ్‌ హబ్షాన్‌ నుంచి రువాయిస్‌ వరకు తొలి స్టేజ్‌ నిర్మాణం పూర్తయ్యింది. రెండో స్టేజ్‌లో ముసాఫా నుంచి ఖలీఫా పోర్ట్‌ మరియు జెబెల్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు ప్లాన్‌ చేశారు. అయితే ఇది సౌదీ ఒమన్‌ బోర్డర్స్‌ వరకూ ఎక్స్‌టెండ్‌ చేయవలసి ఉంది. పూర్తిస్థాయిలో ఎతిహాద్‌ రైల్‌ ప్రాజెక్ట్‌ పూర్తయితే, ఆ తర్వాతే ప్రయాణీకులకు ఈ రైల్‌ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈలోగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికీ, సెవా వంటి సంస్థలతో సంబంధాలు కొనసాగించడానికి సరుకు రవాణాకు అనుమతిచ్చింది ఎతిహాద్‌ రైల్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com