పాక్‌కు భారత్‌ ఆఫర్‌: తెల్ల జెండాలతో వచ్చి మృతదేహాలను తీసుకెళ్లండి

- August 04, 2019 , by Maagulf
పాక్‌కు భారత్‌ ఆఫర్‌: తెల్ల జెండాలతో వచ్చి మృతదేహాలను తీసుకెళ్లండి

శ్రీనగర్‌: భారత సైన్యం హతమార్చిన పాకిస్థాన్‌కు చెందిన బోర్డర్‌ యాక్షన్‌ టీం(బ్యాట్‌) సభ్యుల మృతదేహాలను తీసుకెళ్లడానికి పాక్‌కు భారత సైన్యం అవకాశం కల్పించింది. శ్వేత జెండాలతో వచ్చి మృతదేహాలను తీసుకెళ్లి అంతిమ సంస్కరణలు నిర్వహించుకోవాలని సూచించింది. దీనిపై పాక్‌ ఇంకా స్పందించాల్సి ఉంది. భారత సైనిక పోస్టులపై దాడికి యత్నించిన పాక్‌ బ్యాట్‌ బృందం కుయుక్తులను మన దేశ సైనికులు సమర్థంగా తిప్పికొట్టారు.

జమ్ముకశ్మీర్‌ కుప్వారా జిల్లా కీరన్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద చొరబడడానికి ప్రయత్నించిన ఐదు నుంచి ఏడుగురు వ్యక్తుల్ని భారత సైనికులు హతమార్చారు. బ్యాట్‌ దాడి యత్నం జులై 31న అర్ధరాత్రి తర్వాత, ఆగస్టు 1 తెల్లవారుజాము వేళలో జరిగినట్లు సమాచారం. మృతులు పాక్‌ సైన్యానికి చెందిన స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌ (ఎస్‌ఎస్‌జీ) కమాండోలుగానీ, ఉగ్రవాదులుగానీ కావచ్చని భావిస్తున్నారు. కశ్మీర్‌ లోయలో శాంతికి భగ్నం కలిగించడానికి, అమర్‌నాథ్‌ యాత్రను లక్ష్యంగా చేసుకుని పాక్‌ గత 36 గంటల్లో పలు ప్రయత్నాలు చేసిందని రక్షణశాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com