ట్రాఫిక్‌ అలర్ట్‌: దుబాయ్‌ - షార్జా రోడ్డు మూసివేత

- August 06, 2019 , by Maagulf
ట్రాఫిక్‌ అలర్ట్‌: దుబాయ్‌ - షార్జా రోడ్డు మూసివేత

అజ్మన్ని దుబాయ్‌ని షార్జా మీదుగా కలిపే సర్వీస్‌రోడ్డుని మూసివేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వెల్లడించింది. అల్‌ థికా క్లబ్‌ ఫర్‌ హ్యాండికేప్‌డ్‌ బ్రిడ్జి క్రింద ఈ మూసివేతను అమలు చేస్తున్నారు. రెండు వారాల పాటు ఈ మూసివేత అమల్లో వుంటుంది. అజ్మన్ నుంచి దుబాయ్‌కి షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ రోడ్డుపై వచ్చే వాహనదారులకు సమస్యలు తలెత్తనున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సి వుంటుంది. వారాంతాల్లో అర్థరాత్రి 1 గంట నుంచి, తెల్లవారుఝాము 5.30 నిమిషాల వరకు, శుక్రవారం అర్థరాత్రి 2 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com