ఒకే రోజు రెండు హౌతీ డ్రోన్ల కూల్చివేత
- August 09, 2019సౌదీ అరేబియా: అరబ్ కోలిషన్, రెండో హౌతీ డ్రోన్‌ని గురువారం కూల్చివేయడం జరిగింది. సౌదీ అరేబియాలోని అభా ప్రాంతాన్ని ఈసారి తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. యెమెన్‌లోని మిలిటెంట్స్ క్యాపిటల్ అయిన సనా నుంచి ఈ డ్రోన్ సంధించారు. అంతకు ముందు సౌదీ అరేబియాలోని జజాన్ని టార్గెట్‌గా చేసుకుని తీవ్రవాదులు డ్రోన్ ప్రయోగించగా, దాన్ని సంకీర్ణ దళాలు కూల్చివేశాయి. సంకీర్ణ దళాల అధికార ప్రతినిథి అల్ మాల్కి మాట్లాడుతూ, ఒకే రోజు రెండు డ్రోన్స్‌ని కూల్చివేయడం జరిగిందని చెప్పారు. కాగా, యెమెన్‌లోని సిటిజన్స్ లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు బాలిస్టిక్ మిస్సైల్‌ని సంధించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ