తలనొప్పి నివారణకు సహజసిద్ధమైన చిట్కాలు
- August 12, 2019ఇటీవల కాలంలో ఎక్కువమంది తలనొప్పి సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమస్యను తట్టుకోలేక తరచూ పెయిన్ కిల్లర్స్‌ను వాడుతుంటారు. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఈ మందుల వలన సైడ్ ఎపెక్ట్స్ వస్తున్నాయట. కాబట్టి తలనొప్పి సమస్య నుండి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం.
1. దాల్చినచెక్క ఆహారానికి రుచిని ఇవ్వడమే కాదు.. తలనొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కను పొడిగా చేసి నీటిలో కలిపి నుదుటిపై రాసుకుని ముప్పై నిమిషముల తరువాత వేడి నీటితే కడిగేయాలి.ఇలా చేయడం వలన తలనొప్పి నుండి ఉపశమనం పొందుతారు.
2. తాజా ద్రాక్షా పండ్లను తీసుకుని జ్యూస్ చేసుకుని తాగడం వలన తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ జ్యూస్‌ను రోజుకు రెండు సార్లు తాగితే సరిపోతుంది.
3. అల్లం రసాన్ని కాస్త నిమ్మ రసంలో కలిపి తాగడం వలన తలనొప్పి తగ్గుముఖం పడుతుంది.
4. తలనొప్పి ఎక్కువైనప్పుడు మసాజ్ చేసుకోవడం వలన నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. మెడ, తల భాగాన్ని నొక్కుతూ మెల్లగా మసాజ్ చేసుకోవడం వలన రక్తప్రసరణ పెరిగి తలనొప్పి తగ్గుతుంది.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..