మోడీ యూఏఈ పర్యటన అప్డేట్

- August 19, 2019 , by Maagulf
మోడీ యూఏఈ పర్యటన అప్డేట్

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆగష్టు 23-24 తేదీల్లో యూఏఈ విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. మోడీ పర్యటన యొక్క ఎజెండాను ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) సోమవారం ప్రకటించింది. ప్రవాసీయులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోడీ బహిరంగ సభ లేదంటూ ప్రధాని అభిమానులను నిరుత్సాహపరిచింది. 

ఆగస్టు 23 న యూఏఈ విచ్చేయనున్న మోడీకి ఆగస్టు 24 న అబుధాబి లో అధికారిక సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఇంతకుముందు ప్రకటించినట్లుగా, ప్రధాని మోడీ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్లతో చర్చలు జరపనున్నారు.

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com