మినా నుంచి గ్రాండ్‌ మాస్క్‌కి 43,000 మంది ఉచిత ప్రయాణం

- August 19, 2019 , by Maagulf
మినా నుంచి గ్రాండ్‌ మాస్క్‌కి 43,000 మంది ఉచిత ప్రయాణం

మక్కా: తొలిసారిగా ఈ మక్కా సీజన్‌లో 43,000 మంది ఫిలిగ్రిమ్స్‌కి మినా నుంచి గ్రాండ్‌ మాస్క్‌ వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. టర్కీ, యూరోప్‌, అమెరికా మరియు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఫిలిగ్రిమ్స్‌కి ఈ అవకాశం కలిగింది. తవాఫ్‌ అల్‌ ఇఫాదాహ్‌ పెర్ఫామ్‌ చేయడానికిగాను వీరికి ఈ ఉచిత ప్రయాణం దక్కింది. యూరోప్‌, అమెరికా మరియు ఆస్ట్రేలియాకి చెందిన టర్కీ ముస్లిం ఫిలిగ్రిమ్స్‌ - ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఆఫ్‌ మోతావిఫ్స్‌ - ట్రాన్స్‌పోర్ట్‌ సెక్టార్‌ సూపర్‌ వైజర్‌ అదెల్‌ కారి మాట్లాడుతూ, భవిష్యత్తులో మరింత మెరుగ్గా ఈ సేవల్ని అందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. తష్రీక్‌ సందర్భంగా యాత్రీకుల్ని తరలించే ప్రక్రియ మక్కా గవర్నర్‌ ప్రిన్స్‌ ఖాలిద్‌ అల్‌ ఫైసల్‌ నేతృత్వంలో జరిగిందని చెప్పారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com