ఇండోనేషియాలో ఉద్రిక్తత..పార్లమెంట్‌ భవనానికి నిప్పంటించిన విద్యార్థులు

- August 20, 2019 , by Maagulf
ఇండోనేషియాలో ఉద్రిక్తత..పార్లమెంట్‌ భవనానికి నిప్పంటించిన విద్యార్థులు

జకార్తా : విద్యార్థి సంఘాల నేతలపై పోలీసులు లాఠీలు ఝుళిపించినందుకు నిరసనగా ఇండోనేషియాలో నిరసనలు వెల్లువెత్తాయి. పోలీసుల చర్యలను నిరసిస్తూ విద్యార్థులు కదం తొక్కారు. నిరసనకారులు పవువా ప్రావిన్స్‌ రాజధాని మనోక్‌వరి వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పార్లమెంట్‌ భవనానికి నిప్పంటించారు. 
వాణిజ్య సముదాయాలపై దాడులకు పాల్పడ్డారని ప్రభుత్వ అధికార ప్రతినిధి దేది ప్రసేత్యో తెలిపారు. నిరసన కార్యక్రమాలకు వెస్ట్‌ పపువా నేషనల్‌ కమిటీ నేతృత్వం వహించింది. పలువురు విద్యార్థులను పోలీసులు అక్రమంగా నిర్బంధించిన కారణంగా ఘర్షణ వాతావరణ నెలకొందన్నారు. అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. కాగా, పపువా పశ్చిమ ప్రాంతంలోని సురబయా, మలాంగ్‌ నగరాల్లోని విద్యార్థులను గతవారం పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారు. విద్యార్థులు జాతీయ పతాకాన్ని అగౌరవపరిచారని, అవమానపరిచారంటూ కేసులు పెట్టారు. అయితే, పోలీసుల ఆరోపణలను విద్యార్థులు ఖండించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com