40,000కి పైగా ఒమన్‌ రియాల్స్‌ దొంగిలించిన వలసదారుడు

- August 21, 2019 , by Maagulf
40,000కి పైగా ఒమన్‌ రియాల్స్‌ దొంగిలించిన వలసదారుడు

ఒమన్‌లోని ఓ స్టోర్‌లోంచి 40,000కి పైగా ఒమన్‌ రియాల్స్‌ దొంగిలించిన వలసదారుడ్ని అరెస్ట్‌ చేశారు. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఈ విషయాన్ని ధృవీకరించింది. నిందితుడు 43,000 ఒమన్‌ రియాల్స్‌ని దొంగిలించినట్లు గుర్తించామని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించడం జరిగింది. మస్కట్‌ గవర్నరేట్‌ పరిధిలో పోలీస్‌ కమాండ్‌, నిందితుడ్ని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు అధికారులు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com