అమిత్ జీ టికెట్ డబ్బులు తీసుకోలేదు: చిరు
- August 21, 2019
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'సైరా'. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరు, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటించారు. నయనతార, తమన్నా, అనుష్క, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలో నటించారు. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ కోసం ముంబై వెళ్లిన చిరు, బిగ్ బీ గురించి ఆసక్తికర విషయం తెలిపారు.
'అమితాబ్ మా వద్ద విమానం టికెట్ల డబ్బులు తీసుకోవడానికి నిరాకరించారు. మేం కూడా బలవంతం చేయలేకపోయాం. అది నిజంగా గొప్ప విషయం. అమితాబ్ ప్రయాణించడం కోసం ప్రైవేటు జెట్ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. కానీ ఆయన దానికి కూడా ఒప్పుకోలేదు. ముంబయి నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో బస చేయడం గురించి అడిగా. 'నేను ఇదంతా స్నేహం కోసం చేస్తున్నా' అన్నారు.
చాలా సంవత్సరాలుగా మా ఇద్దరికీ పరిచయం ఉంది. అలా అదృష్టవశాత్తు మా సినిమాలో ఆయన నటించేందుకు ఒప్పుకున్నారు. అమితాబ్ బచ్చన్‌కు రుణపడిపోయాను అన్నారు చిరు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!