'పహిల్వాన్' ట్రైలర్ వివిడుదలకు సిద్ధం
- August 21, 2019
కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ఇప్పుడు మల్టీలాంగ్వేజ్ నటుడుగా మారుతున్నారు. ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు లో ఎస్ ఎస్ రాజమౌళి -నాని కాంబినేషన్ లో వచ్చిన 'ఈగ'సినిమాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు. ఈ సినిమాలో ఈగతో విలన్ పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు..సీరియస్, కామెడీ ఇలా ఎన్నో వేరియేషన్స్ తో మెప్పించాడు సుదీప్. వాస్తవానికి ఈ మూవీలో నాని హీరో అయినప్పటికీ కొద్దసేపు మాత్రమే కనిపిస్తాడు. ఫుల్ లెన్త్ నటన సుదీప్ తోనే సాగుతుంది.
ఈ మూవీలో సమంత నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన 'బాహుబలి' సినిమాలో నటించాడు. తాజాగా మెగస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' మూవీలో కూడా సుదీప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మొత్తానికి కన్నడలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న సుదీప్ మిగతా భాషల పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే విలన్ గా చేస్తూ తన స్థాయిని పెంచుకుంటున్నాడు. ప్రసుతం తాను అన్ని భాషల్లో నటిస్తున్నాడు కనుక తాను నటించే సినిమాలు అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నాడు సుదీప్.
యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన పహిల్వాన్ సినిమాను కన్నడతో పాటు తెలుగు తమిళ్ హిందీ మలయాళం బాషాల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. క్రేజ్ ఉన్న మూమెంట్ లో గురువారం అన్ని భాషల ప్రజలను ట్రైలర్ తో టచ్ చేయడానికి సిద్దమయ్యాడు. ఆ మద్య ఈ మూవీకి సంబంధించి కన్నడ ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలుగు లో పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగులో గురువారం అన్ని భాషల ప్రజలను ట్రైలర్ తో టచ్ చేయడానికి సిద్దమయ్యాడు. కాగా, పహిల్వాన్ సినిమాలో సుదీప్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. కన్నడలో లో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎస్ కృష్ణా తెరకెక్కించిన ఈ సినిమాను స్వప్న కృష్ణ నిర్మించారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!