వరదరాజ పెరుమాళ్‌కు రూ. 9.90 కోట్ల హుండీ కానుకలు
- August 22, 2019
కాంచీపురం: కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో నిర్వహించిన అత్తి వరదర్ ఉత్సవాల సందర్భంగా రూ.9.90 కోట్ల హుండీ కానుకలు వచ్చాయని జిల్లా కలెక్టరు పొన్నయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో... ఈ ఆలయంలో జులై ఒకటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు అత్తి వరదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారికి కానుకలను చెల్లించు కోవడానికి వీలుగా ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ తరఫున 18 హుండీలను ఉంచామని తెలిపారు. వీటిల్లో 13 హుండీలలోని కానుకలను మాత్రమే లెక్కించారని వెల్లడించారు. తద్వారా రూ.9.90 కోట్ల నగదు, 164 గ్రాముల బంగారం, 4,959 గ్రాముల వెండి కానుకలు వచ్చినట్లు చెప్పారు. మిగిలిన హుండీల కానుకలను లెక్కించాల్సి ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..