దుబాయ్‌కి విమాన సర్వీసుల్ని ప్రారంభించిన విస్తారా
- August 22, 2019
భారతదేశానికి చెందిన విస్తారా ఎయిర్ లైన్స్ ముంబై మరియు దుబాయ్ మధ్య డైలీ సర్వీస్‌లను ప్రారంభించింది. విస్తారాకి ఇది రెండో అంతర్జాతీయ డెస్టినేషన్ కావడం గమనార్హం. ముంబై నుంచి ఆగస్ట్ 21న బయల్దేరిన విస్తారా తొలి విమానం, దుబాయ్‌కి 6 గంటలకు చేరుకుంది. ముంబై నుంచి సాయంత్రం 4.25 నిమిషాలకు బయల్దేరే విమానం, దుబాయ్‌కి సాయంత్రం 6.15 నిమిషాలకు చేరుకుంటుంది. దుబాయ్ నుంచి 7.15 నిమిషాలకు ప్రారంభమై ముంబైకి 12.15 నిమిషాలకు చేరుకుంటుంది. బిజినెస్, ఎకానమీ క్లాస్‌తోపాటు ప్రీమియమ్ ఎకానమీ క్లాస్‌లో తాము విమాన సర్వీసుల్ని అందిస్తున్నట్లు విస్తారా వెల్లడించింది. ఇదిలా వుంటే, తమ మూడో అంతర్జాతీయ డెస్టినేషన్ అయిన బ్యాంకాక్‌కి ఈ నెల 27న విమాన సర్వీస్ ప్రారంభించనుంది విస్తారా.
తాజా వార్తలు
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!