పంజాబ్ ను టార్గెట్ చేసిన పాక్

- August 26, 2019 , by Maagulf
పంజాబ్ ను టార్గెట్ చేసిన పాక్

ఆర్టికల్ 370 రద్దు తరువాత పాకిస్తాన్ నిత్యం ఏదో ఒక రూపంలో ఇండియాకు ఇబ్బందులు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నది. దానివలన ఎలాంటి ఫలితం ఉండదని తెలిసినప్పటికీ.. పాక్ మాత్రం తన బుద్దిని మార్చుకోలేదు. బోర్డర్ లో కాల్పుల విరమణకు స్వస్తిపలికి ఇండియాపై దాడులకు పాల్పడుతూనే ఉన్నది. తాజాగా మరోసారి ఇండియా దాడులకు పాల్పడింది. అయితే, ఈసారి రూటు మార్చింది.

పాకిస్తాన్ తన దేశంలో ఉన్న సట్లెజ్ నది గేట్లను ఎలాంటి హెచ్చరికలు చేయకుండా ఎత్తేసింది. సడెన్ గా ఇలా పాకిస్తాన్ ఆ నది గేట్లు ఎత్తివేయడంతో ఇండియాలోని పంజాబ్ ను వరదలు ముంచెత్తాయి. ఫిరోజ్ పూర్ లోని పలు గ్రామాలు ఈ వరద నీటిలో చిక్కుకున్నాయి. అంతేకాదు.. తెండివాలా గ్రామం వద్ద ఉన్న కరకట్ట దెబ్బతింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యి దెబ్బతిన్న కరకట్టకు మామ్మత్తులు చేస్తున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి పాక్ చేసిన పనిపై మండిపడుతున్నారు. హెచ్చరికలు లేకుండా పాక్ చేసిన పనిని అయన దుయ్యబట్టారు. గతంలోనూ పాక్ ఇలానే చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com