మెగాస్టార్ ప్రయాణిస్తున్న విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం ..
- August 31, 2019
మెగాస్టార్ చిరంజీవి ప్రయాణిస్తున్న విమానానికి తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం వల్ల ముంబైలో టేకప్ అయినా విమానం అరగంటకే తిరిగి అక్కడే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ముంబై నుంచి హైదరాబాద్ కు వస్తున్న విస్తార ఎయిర్లైన్స్ (యూకే869) విమానానికి సాంకేతిక లోపం రావడంతో పైలెట్ అప్రమత్తమయ్యి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు.
ఇలా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండి చేసిన సమయంలో ఆ విమానంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు దాదాపు 120 మంది ప్రయాణికులు ఆ విమానంలో ఉన్నారు. త్వరలో విడుదల కానున్న 'సైరా నరసింహ రెడ్డి' సినిమా ప్రమోషన్ కోసం ఆయన ముంబై వెళ్లారు. ప్రేమోషన్ పూర్తయిన తర్వాత తిరిగి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటన చోటుచేసుకున్న అనంతరం ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మరో విమానాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులను హైదరాబాద్ కి పంపారు. ఏది ఏమైనా చిరంజీవి తో సహా 120 మంది ప్రయాణికులను కాపాడి పైలెట్ మంచిపేరు సంపాదించుకున్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఓ ప్రయాణికుడు చిరంజీవి ఫోటోని తీసి ఈ ఘటన గురించి పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఆ ఫోటో కూడా ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. అయితే చిరంజీవి తృటిలో ప్రమాదం తప్పడంతో అభిమనులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరగకుండా సాంకేతిక లోపాన్ని ముందుగానే గుర్తించిన పైలెట్ ని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఏది ఏమైనా మన మెగా స్టార్ మరోసారి లక్కీ బాయ్ అని రుజువు చేసుకున్నాడు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!