వచ్చే నెలలో పూర్తి కానున్న కోస్టల్‌ రోడ్‌

- September 06, 2019 , by Maagulf
వచ్చే నెలలో పూర్తి కానున్న కోస్టల్‌ రోడ్‌

మస్కట్‌: ముసాందమ్‌ గవర్నరేట్‌లోని ఖసబ్‌ కోస్టల్‌ రోడ్‌ గ్యాంగ్‌ వే అక్టోబర్‌ చివరి నాటికి పూర్తయ్యే అవకాశం వున్నట్లు ముసాందం గవర్నర్స్‌ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. విలాయత్‌ ఆఫ్‌ ఖసబ్‌లో నిర్మితమవుతున్న రోడ్‌ ప్రాజెక్ట్‌ని గవర్నర్‌ పర్యవేక్షించారని, సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఆయన పరిస్థితిని తెలుసుకున్నారని తెలుస్తోంది. 2015 ఫిబ్రవరి 10న ఈ ్పఆజెక్ట్‌ ప్రారంభమయ్యింది. ఈ రోడ్డు పూర్తయితే ఒమన్‌లోని టూరిజం మరియు కామర్స్‌ సెక్టార్‌కి మరింత ఊతం లభించినట్లవుతుంది. 40 మిలియన్‌ ఒమన్‌ రియాల్స్‌ ఖర్చుతో ఈ ప్రాజెక్టుని చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com