రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి.. డ్రైవర్‌ అరెస్ట్‌

- September 06, 2019 , by Maagulf
రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి.. డ్రైవర్‌ అరెస్ట్‌

బహ్రెయిన్‌: ముహర్రాక్‌ గవర్నరేట& పరిధిలోని ఖలీఫా బిన్‌ సల్మాన్‌ పోర్ట్‌ వద్ద ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ కాజ్‌వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బహ్రెయినీ వ్యక్తి మృతి చెందిన విషయం విదితమే. ఈ ప్రమాదానికి కారకుడిగా భావిస్తూ ట్రక్‌ డ్రైవర్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణ నేపథ్యంలో ఏడు రోజులపాటు కస్టడీకి నిందితుడ్ని పంపినట్లు పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ తెలిపింది. ఇతర వాహనాల్ని గమనించకుండా నిర్లక్ష్యపూరితంగా ట్రక్‌ డ్రైవర్‌ తన వాహనాన్ని యూ టర్న్‌ చేయడమే ఈ ప్రమాదానికి కారణమని విచారణ సందర్భంగా తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com