దుబాయ్‌ రేడియో హోస్ట్‌ మృతి పట్ల దిగ్భ్రాంతి

- September 10, 2019 , by Maagulf
దుబాయ్‌ రేడియో హోస్ట్‌ మృతి పట్ల దిగ్భ్రాంతి

దుబాయ్‌లోని డాన్స్‌ ఎఫ్‌ ఎం 87.8 హోస్ట్‌ లూసీ స్టోన్‌ మృతి చెందారు. ఈ మేరకు సదరు రేడియో ఛానల్‌, ఓ సంతాప ప్రకటనను అధికారిక ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా వెల్లడించింది. లూసీ స్టోన్‌ వయసు 38 సంవత్సరాలు. రేడియో విభాగంలో అద్భుతమైన ఎనర్జీతో, అంతే అద్భుతమైన హ్యూమర్‌తో లూసీ స్టోన్‌ అందర్నీ ఆకట్టుకున్నారు. ఇదిలా వుంటే ఈ ఏడాది జనవరిలో మరో రేడియో ప్రెజెంటర్‌ జేమ్స్‌ ఎలి అరామౌని ప్రాణాలు కోల్పోయారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com