హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా దత్తాత్రేయ ప్రమాణం
- September 11, 2019
హిమాచల్ ప్రదేశ్ కొత్త గవర్నర్ గా ఈరోజు (సెప్టెంబర్-11,2019) ఉదయం బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేశారు. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో దత్తాత్రేయ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధరమ్ చంద్ చౌదరి దత్తాత్రేయతో ప్రమాణం చేయించారు.
హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్, విద్యాశాఖ మంత్రి సురేష్ భరద్వాజ్, మాజీ సిఎం వీరభద్ర సింగ్, మాజీ సిఎం ప్రేమ్ కుమార్ ధుమాల్ సహా పలువురు ప్రముఖులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, దత్తాత్రేయ కుటుంబసభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సుమారు 300 మంది అతిథులు వచ్చారు.
హిమాచల్ ప్రదేశ్ 27వ గవర్నర్‌గా దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సంస్కృతిలో భాగంగా ధరించే హిమాచలీ క్యాప్‌ను సీఎం ఠాకూర్ మంగళవారం నూతన గవర్నర్‌కు అందజేసి శాలువాతో సత్కరించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా క్యాప్‌ను ధరించి దత్తాత్రేయ ప్రమాణం చేశారు. అంతకుముందు రాష్ట్రమంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు దత్తాత్రేయకు ఘనస్వాగతం పలికారు.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు