'రాక్షసుడికి' గెస్టవనున్న 'బాహుబలి' & 'కింగ్'
- May 16, 2015
సూర్య కథానాయకుడిగా వెంకటప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మాస్' సినిమా 'రాక్షసుడు' టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకిరానుంది. సూర్య సరసన నయనతార, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. స్టూడియోగ్రీన్ పతాకంపై కే.ఈ.జ్ఞానవేల్‌రాజా సమర్పిస్తున్న ఈ సినిమాను మేధా క్రియేషన్స్ అధినేతలు మిరియాల రాజాబాబు, మిరియాల రవీందర్ రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఈనెల 18న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఘనంగా విడుదల చేయనున్నారు. ఈ ఆడియో కార్యక్రమానికి 'బాహుబలి' డైరెక్టర్ రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌లతో పాటు కింగ్ నాగార్జున హాజరుకానున్నారట. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!









