లేబర్‌ చట్టం ఉల్లంఘన: 15 మంది వలసదారుల అరెస్ట్‌

- September 20, 2019 , by Maagulf
లేబర్‌ చట్టం ఉల్లంఘన: 15 మంది వలసదారుల అరెస్ట్‌

మస్కట్‌: నార్త్‌ అల్‌ షర్కియా గవర్నరేట్‌లో 15 మంది వలసదారుల్ని అరెస్ట్‌ చేశారు. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. లేబర్‌ చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు అరెస్ట్‌ చేసినవారిపై అభియోగాలు మోపబడ్డాయి. నార్త్‌ అల్‌ షర్కియా గవర్నరేట్‌ పోలీస్‌ కమాండ్‌, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌తో కలిసి నిర్వహించిన ఆపరేషన్‌ ద్వారా ఈ అరెస్టులు జరిగాయి. విలాయత్‌ బిదియాలో వలసదారుల్ని అదుపులోకి తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com