ఎల్‌ఐసీ పాలసీ:సింగిల్ ప్రీమియం.. ప్రతి నెలా ఆదాయం..
- September 21, 2019
ఇండియా:భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) వివిధ రకాల ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. వాటిలో పెన్షన్ ప్లాన్ కూడా ఒకటి. అదే ఎల్‌ఐసీ జీవన్ శాంతి స్కీమ్. పాలసీ తీసుకున్నవారు జీవించి ఉన్నంత కాలం వారికి పెన్షన్ వస్తుంది. అంతే కాకుండా ప్లాన్‌పై లోన్ సౌకర్యం కూడా ఉంది. ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకుంటే అదనపు ప్రయోజనం పొందొచ్చు. ఇందులో 9 రకాల యాన్యుటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 7 ఆప్షన్లు వెంటనే పెన్షన్ అందించేవి కావడం గమనార్హం. ఈ పాలసీని ఒకరి పేరుపై లేదా జాయింట్‌గా కూడా తీసుకోవచ్చు. కనీసం రూ.1,50,000 మొత్తానికి పాలసీ తీసుకోవాలి. గరిష్ట పరిమితి లేదు. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ. ప్రీమియం మొత్తాన్ని ఒకేసారి చెల్లించవలసి ఉంటుంది. తరువాత మళ్లీ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేకుండా పాలసీ తీసుకోవచ్చు. 30 నుంచి 79 ఏళ్ల మధ్యలో ఉన్నవారు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఒకేసారి రూ.10 లక్షలు పెట్టి 45 ఏళ్ల వయసులో పాలసీ తీసుకుంటే.. ఏడాదికి రూ.74,000 నుంచి రూ.2.3 లక్షల వరకు వార్షిక యాన్యుటీ పొందవచ్చు. వచ్చే ఆదాయం మీరు ఎంచుకున్న యాన్యుటీ ఆప్షన్ ప్రాతిపదికన మారుతుంది. అయితే డబ్బు తక్షణం పొందాలా లేదంటే కొంత కాలం తర్వాత నుంచి తీసుకోవచ్చా అనేది మన ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది. పాలసీ తీసుకున్న వారికి ఆదాయపు పన్ను చట్టం 80 సీ కింద పన్ను మినహాయింపు కూడా ఉంది. ఒకవేళ పాలసీ తీసుకున్న తరువాత మీకు నచ్చలేదని అనిపిస్తే 15 రోజుల్లోపు దీన్ని తిరిగి సంస్థకు ఇచ్చేయొచ్చు. అదే ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకుంటే 30 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది.ఈ పాలసీ వివరాలకు మొబైల్ నెంబర్:00919949322175 కి కాల్ చెయ్యగలరు.
తాజా వార్తలు
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!