సౌదీ నేషనల్‌ డే: డిస్కౌంట్లు, స్పెషల్‌ ఈవెంట్లు..

- September 23, 2019 , by Maagulf
సౌదీ నేషనల్‌ డే: డిస్కౌంట్లు, స్పెషల్‌ ఈవెంట్లు..

దుబాయ్‌: సౌదీ అరేబియా నేషనల్ డే సందర్భంగా దుబాయ్‌లో పలు ఈవెంట్స్‌, ఫైర్‌ వర్క్స్‌ ప్రధాన ఆకర్షణలుగా మారాయి. స్పెషల్‌ ఆఫర్స్‌, గ్రేట్‌ వాల్యూతో దుబాయ్‌, సౌదీ అరేబియా నేషనల్‌ డే వేడుకలకు సర్వసన్నద్ధమయ్యింది. బుర్జ్‌ ఖలీఫాపై సౌదీ అరేబియా జాతీయ పతాకం వెలుగులు కనిపించబోతున్నాయి ఈ రోజు. రాత్రి 7.15 నిమిషాలకు అలాగే 8.10, 9.10, 9.50 నిమిషాలకు ఈ స్పెషల్‌ లైటింగ్‌ కన్పిస్తుంది. ది పాయింట్‌లో మూడు నిమిషాల ఫైర్‌ వర్క్స్‌ రాత్రి 8.30 నిమిషాలకు వుంటుంది. ది బీచ్‌, జెబిఆర్‌లో రాత్రి 9 గంటలకు ఫైర్‌ వర్క్స్‌ వుంటాయి. బ్లూ వాటర్‌ ఐలాండ్‌లో 8.30 నిమిషాలకు ఫైర్‌ వర్క్స్‌ షో జరుగుతుంది. దీంతోపాటు పలు యాక్టివిటీస్‌ ఇక్కడ సందర్శకుల్ని అలరించనున్నాయి. కాగా, ప్రముఖ ఎట్రాక్షన్స్‌లో 70 శాతం వరకు డిస్కౌంట్లతో టిక్కెట్స్‌ అందుబాటులో వుంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com