జగపతిబాబు విడుదల చేసిన 'విఠల్వాడి' ఫస్ట్ లుక్...
- September 23, 2019ఎన్.ఎన్. ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 'విఠల్వాడి' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నటుడు జగపతిబాబు విడుదల చేశారు. నాగేందర్. టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను నరేష్ రెడ్డి. జి నిర్మించారు. ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమంలో జగపతిబాబుతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ.. ''విఠల్వాడి చిత్రం ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. చిత్ర యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న రోహిత్‌కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. నిర్మాత నరేష్ రెడ్డి మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను..'' అన్నారు.
నిర్మాత నరేష్ రెడ్డి. జి మాట్లాడుతూ.. ''హైదరాబాద్‌లోని విఠల్వాడి అనే ఏరియాలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమా నిర్మించాము. కథ, కథనాలు ఈ సినిమాలో కొత్తగా ఉంటాయి. పాటలు, ఫైట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని నమ్మకం ఉంది. త్వరలో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తాము'' అన్నారు.
హీరో రోహిత్ మాట్లాడుతూ.. ''మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన జగపతిబాబుగారికి ధన్యవాదాలు. విఠల్వాడి సినిమాతో హీరోగా పరిచయం అవ్వడం సంతోషం. నిర్మాత నరేష్ రెడ్డిగారు బాగా ఖర్చు పెట్టి సినిమాను క్వాలిటీగా నిర్మించారు. ఈ మూవీ మా అందరికి మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాము'' అన్నారు.
దర్శకుడు టి. నాగేందర్ మాట్లాడుతూ.. ''మా సినిమా ప్రమోషన్ జగపతిబాబుగారితో మొదలవ్వడం సంతోషం. విఠల్వాడి కథ నిజ జీవితంలో జరిగిన ఒక యదార్ధ ప్రేమకథ. చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో పంచుకుంటాము..'' అన్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..