గోల్డ్‌, నగదు దొంగతనం: వలస మహిళ అరెస్ట్‌

- September 24, 2019 , by Maagulf
గోల్డ్‌, నగదు దొంగతనం: వలస మహిళ అరెస్ట్‌

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీసులు ఓ మహిళను అరెస్ట్‌ చేశారు. నిందితురాలిపై నగలు, నగదు దొంగతనం చేసినట్లు అభియోగాలు మోపారు పోలీసులు. నార్త్‌ అల్‌ బతినా గవర్నరేట్‌ పరిధికి చెందిన పోలీస్‌ కమాండ్‌, ఈ మహిళను అరెస్ట్‌ చేయడం జరిగింది. నిందితురాలిని అరబ్‌ జాతీయురాలిగా గుర్తించారు. పలు చోట్ల ఆమె దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత అథారిటీస్‌కి ఆ కేసుని అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com